
కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్
Jun 11 2026 1:56 PM | Updated on Jun 11 2026 2:02 PM
కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్‌ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.
వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్‌బాల్ పండగ (ఫోటోలు)
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
కామారెడ్డిలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్..
అమ్మ.. రమనందనా.. తప్పించుకుందాం అనుకున్నావా?
1:1 అంటే అర్ధం ఏంటి చంద్రబాబు.. ఇలాంటి మోసాన్ని నా జన్మలో చూడలేదు
స్పోర్ట్స్ కోటాలో స్కామ్స్ వింటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..బాబు, లోకేష్ పై జగన్ మాస్ ర్యాగింగ్