
లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సోదాలు.. విచారణలు చేస్తున్న ఈడీ ఒక్క సారిగా అరెస్టులు చేయటం మొదలు పెట్టింది. లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పది మంది నివాసాల్లో ఈడీ సోదాలు
చేస్తోంది. ఇదే సమయంలో ఏ-1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అదుపు లోకి తీసుకున్న ఈడీ.. ఇదే కేసులో వైసీపీ మాజీ మంత్రిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదుపు లోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెబుతున్న ఈడీ అరెస్ట్ ను అధికారంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఈ రోజు ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సిట్ పలువురిని విచారణ చేసి అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ .. హవాలా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో నాటి బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని విచారణ చేస్తున్నారు. పది మంది నివాసాలు.. కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు వారిని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేస్తోంది. ఇప్పటికే వారి విచారణలో సేకరించిన సమాచారం తో పాటుగా గుర్తించిన నగదు లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ కేసులో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను గుర్తించారు. వందల కోట్ల మేర అక్రమంగా లావాదేవీలు గుర్తించిన అధికారులు ఈ దిశగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.లిక్కర్ కేసులో ఈడీ తొలి అరెస్ట్, నెక్స్ట్ ఇక..!!లిక్కర్ రవాణా కేసులో లావాదేవీలుకాగా, ఇదే కేసుల మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావును గతంలో సిట్ విచారణ చేసింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి పైన అభియోగాలు ఉన్నాయి. వందల కోట్ల మేర లావా దేవీలు నిర్వహించినట్లు విచారణలో గుర్తించారు. మద్యం రవాణా, టెండర్లు సబ్ కాంట్రాక్టుల అవకతవకల విషయంలో కారుమూరిపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మద్యం రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.200 నుంచి రూ. 250 కోట్ల వరకు గండి కొట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి అదుపులోకి తీసుకున్న ఈడీ లావాదేవీల పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజ్ కేసిరెడ్డితో పాటుగా కారుమూరిని అరెస్ట్ చేసినట్లు గా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో కారుమూరి తాను తణుకులోనే ఉన్నానని.. తనను ఎవరూ అదుపులోకి తీసుకోలేదని ప్రకటన విడుదల చేసారు. దీంతో.. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన ఈడీ అధికారులు చేసే ప్రకటన కీలకం కానుంది.