
జమ్మికుంట: దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి
వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.‘‘ హైదరాబాద్‌లో పాలు తాగి 3 రోజులు ఆసుపత్రి పాలయ్యా. 20 ఏళ్లలో ఎప్పుడూ నాకు జ్వరం రాలేదు. బీపీ, షుగర్ లేదు. నరేంద్ర మోదీయే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం.. భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది. రోగానికి కారకులం మనమే.. నివారించగలిగేది మనమే. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.2,400 కోట్లు కేటాయించింది. ప్రకృతి వ్యవసాయం చేస్తే రెండు.. మూడేళ్లు లాభాలు రాకపోయినా, ఆ తర్వాత రైతులు కోటీశ్వరులవుతారు. ఆర్గానిక్ ఉత్పత్తులను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రైతులు గమనించి ప్రకృతి వ్యవసాయం చేయాలి.
ముందుగా సేంద్రీయ సాగు చేసే వాళ్లు కోటీశ్వరులు కావొచ్చు. బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు యూరియాకు ఖర్చు చేస్తున్నాం. రూ.1.20 లక్షల కోట్ల సొమ్ము విదేశాలకు పంపి యూరియా దిగుమతి చేసుకోవడం బాధాకరం. రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటా. ప్రకృతి వ్యవసాయంతో వచ్చిన పంటకు మద్దతు ధర ఇచ్చేలా చూస్తాం. మన దేశ సొమ్మును విదేశాలకు పంపి ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటున్నాం. అందుకే మేక్ ఇన్ ఇండియాతో స్వదేశీ ఉత్పత్తులను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’’ అని కేంద్రమంత్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.