
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో భారీ ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రాపిక్' (Anthropic)తో గ్లోబల్ వ్యూహాత్మక
భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా తమ సంస్థలోని 50,000 మంది ఉద్యోగులకు ఆంథ్రాపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్' (Claude) ఫ్యామిలీ ఏఐ మోడల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ స్థాయిలో ఏఐని విస్తృతంగా స్వీకరించే వ్యూహంలో ఇది ఒక కీలకమైన అడుగు అని టీసీఎస్ పేర్కొంది.ఈ భాగస్వామ్యం ద్వారా క్లాడ్ ఏఐ మోడల్స్‌పై పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్ అందించేందుకు టీసీఎస్ ఒక ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, లైఫ్ సైన్సెస్ వంటి అత్యంత నియంత్రిత పరిశ్రమలలో ఏఐ ప్రాజెక్టులను కేవలం ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ అందిస్తున్న పాలన, నియంత్రణలు, అమలులో ఉన్న నైపుణ్యాలను క్లాడ్ ఏఐ సామర్థ్యాలతో కలపడం ద్వారా సంస్థలు ప్రయోగాలకే పరిమితం కాకుండా ఆత్మవిశ్వాసంతో ఏఐని వాస్తవ వినియోగంలోకి తేగలవని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఒప్పందం టీసీఎస్ ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌లు, డొమైన్-స్పెసిఫిక్ సొల్యూషన్స్‌కు కూడా విస్తరించనుంది. ఉదాహరణకు యూకేలో 22 మిలియన్ల కస్టమర్లకు సేవలు అందిస్తున్న టీసీఎస్ అనుబంధ సంస్థ 'డైలిజెంటా', కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్లాడ్‌ను ఉపయోగించుకోనుంది. అదేవిధంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) బృందాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ కార్యకలాపాలలో ఉత్పాదకతను పెంచుకోవడానికి 'క్లాడ్