
అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల క్రికెట్ జట్ల వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)
తాజాగా విడుదల చేసిన పురుషుల వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత మూడేళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అయితే, ఈ ప్రక్రియలో భారత్ రేటింగ్ పాయింట్లు 119 నుంచి 118కి స్వల్పంగా తగ్గాయి.
దీంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం 8 నుంచి 5 పాయింట్లకు పడిపోయింది. ప్రస్తుతం కివీస్ జట్టు రెండు పాయింట్లను మెరుగుపరుచుకుని 113 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి మార్పు లేకుండా 109 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
టాప్-10లో జరిగిన ఏకైక మార్పు ఏమిటంటే.. పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా (102) నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా, వన్డేలతో పాటు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ నెం.1 స్థానంలోనే కొనసాగుతుండటం గమన్హారం. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. మహిళల వన్డే , టీ20ఐ జాబితాలు రెండింటిలోనూ ఆస్ట్రేలియా నెం. 1 స్థానంలో ఉంది.
విదేశీ గడ్డపై వైభవ్ విశ్వరూపం.. హాఫ్ సెంచరీ మిస్
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవద్దు: ఇంగ్లండ్ మాజీ ప్లేయర్