
Flex Fuel Vehicles in India: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అంటే, ఈ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ పెట్రోల్ మీద కొంత రేటు
Flex Fuel Vehicles Run on E22 to E85 Petrol Ethanol Across India
Flex Fuel Vehicles in India: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అంటే, ఈ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ పెట్రోల్ మీద కొంత రేటు తగ్గుతుందన్నమాట. ఇప్పటి వరకు వీటి మీద కూడా కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీ ఇక నుంచి తీసేస్తారు.
దేశంలో కాలుష్య నివారణ కోసం ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకోసం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతారు. ఆ ఇథనాల్ శాతం ఎంత కలిపితే దాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి 22 శాతం ఇథనాల్, 78 శాతం పెట్రోల్ కలిస్తే అది E22 పెట్రోల్ అన్నమాట.
ప్రస్తుతం మనం వాడుతున్నది E20 పెట్రోల్. ఈ మధ్య కాలంలో మోటార్ కంపెనీలు కూడా ఇథనాల్ బ్లెండింగ్ ఎంత పెరిగినా తట్టుకోదగిన స్థాయిలో ఇంజిన్లను తయారు చేస్తున్నారు. అంటే E85 వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటిని ఫ్లెక్స్ ఫ్యూయర్ వాహనాలు అంటారు.
పైన చెప్పిన వాహనాలు మీ దగ్గర ఉంటేనే మీరు E22, E25, E27, E30 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌తో అయినా నడిపించవచ్చు.