
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Nipah Virus Outbreak In Kerala 2026: దేశవ్యాప్తంగా నిఫా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ కేరళలో ఈ ఏడాది తొలి కేసుగా నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం బాధితుడికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రి సిబ్బందిని కూడా (క్వారంటైన్) చేశారు. ఎనిమిదేళ్ల కాలంలో కేరళలో ఇది ఆరవ కేసు కావడం గమనార్హం. వైరస్‌ను అక్కడి ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ వైరస్ సోకిన 43 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందుతోంది, అతను కొజికోడ్ నివాసిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
ప్రధానంగా ఈ వ్యక్తికి స్వల్ప జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరిస్థితి క్షీణించడంతో అతడిని కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతనికి వెంటిలేటర్ సాయంతో వైద్యం అందిస్తున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న ఆసుపత్రి సిబ్బందిని, అతని సన్నిహితులను కూడా క్వారంటైన్లో ఉంచారు.
అయితే దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ పేర్కొన్నారు. వైద్యుల అంచనా ప్రకారం అతను ఇటీవల ఒక గోదామును అద్దెకు తీసుకుని శుభ్రం చేసే క్రమంలో ఈ నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. 2018 నుండి కేరళలో ఇది ఆరవ కేసు కావడం గమనార్హం.
సుంగై నిపా గ్రామంలో తొలి కేసు .. ఈ వైరస్ గురించి చెప్పాలంటే.. 1998లో మలేషియాలోని సుంగై నిపా గ్రామంలో తొలి కేసు నమోదైంది. అందుకే దీనికి నిఫా వైరస్ అనే పేరు వచ్చింది. అప్పట్లో గబ్బిలాల ద్వారా పందులకు ఈ వ్యాధి సోకడం వల్ల, ఫామ్ వర్కర్లకు కూడా ఇది వ్యాపించింది. దీనివల్ల సుమారు 265 మందికి సోకి, 100 మంది మరణించారు. అప్పట్లో వ్యాప్తిని అరికట్టడానికి 10 లక్షల పందులను చంపాల్సి వచ్చింది.
తరువాత మలేషియా నుండి ఈ వైరస్ సింగపూర్, భారత్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, కాంబోడియా, థాయిలాండ్ వంటి ఆరు దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా దీని ప్రభావం కనిపించింది. 2001లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 66 కేసులు నమోదు కాగా, అందులో 45 మంది మరణించారు. 2007లో బెంగాల్లో మరో ఐదు కేసులు నమోదయ్యాయి.. అందులో ఒకరు మరణించారు. ఆ తర్వాత 2018లో ఈ వ్యాధి కేరళకు చేరింది. గత ఎనిమిదేళ్లలో కేరళలో ఇప్పటివరకు మొత్తం 6 కేసులు నమోదయ్యాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.