
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Minister Ponnam Prabhakar Latest News: కరీంనగర్ నగరానికి సంబంధించిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు ఎంతమాత్రం తగవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరానికి సంబంధించిన ప్రగతిపై బురదజల్లే ప్రయత్నాలను ఆపాలని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (MRF) ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా చర్చించిన్నట్లు తెలుస్తోంది.
మానేరు రివర్ ఫ్రంట్ రెండో విడుత పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ సందర్భంగా ఆధారాలతో సహా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని.. వారు గతంలో పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తూ.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తోందని ఆయన వెల్లడించారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటూ.. అనవసర విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
డంప్ యార్డ్ తరలింపునకు కేంద్రం సహకరించాలి... కరీంనగర్ ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి పెద్ద సమస్యగా ఉన్న స్థానిక డంప్ యార్డ్ తరిలింపుపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. నిధుల మంజూరుతో పాటు తరలింపు ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
కరీంనగర్ సమగ్ర శ్రేయస్సు కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని.. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులెత్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. విమర్శలు పక్కన పెట్టి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాధన కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పార్టీల తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.