
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి డోలా బాలా వీరాంజనేయస్వామి (Veeranjaneya Swamy) హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి
బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందని వెల్లడించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి మంత్రులు (Ministers) అధికారులు వెళ్లి బాధితులకు భరోసానిచ్చారని గుర్తు చేశారు. ప్రమాద కారణాలపై త్రిసభ్య కమిటి విచారణ చేస్తోందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఉద్యోగ (Job) అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కానీ వైసీపీ మీడియా (YCP Media) మాత్రం బురద జల్లుతోందని మండిపడ్డారు. ఈ విషాద ఘటనపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ సమయంలో బాధితులను ఓదార్చడమే అందరి బాధ్యత అన్నారు.