
అట్లాంటా తెలుగు సంఘం (TAMA) ఉచిత క్లినిక్ సేవల మద్దతు కోసం నిర్వహించబోయే ‘5K వాక్’ అధికారిక పోస్టర్ , ముఖ్య వివరాలను విడుదల చేసింది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే పూర్తి ఆదాయాన్ని ఇన్సూరెన్స్ లేని పేద
కుటుంబాలు, అమెరికాకు తాత్కాలికంగా వచ్చే భారతీయ తల్లిదండ్రులు (Visiting Parents) , విద్యార్థులకు ఉచిత వైద్య, దంత సంరక్షణ అందించడానికి ఉపయోగించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఉచిత క్లినిక్ సేవలను గుర్తించి జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (DPH) గతంలో పలుమార్లు అవార్డులను అందజేసింది. ఇప్పటివరకు 14,000 మందికి పైగా ప్రజలు ఈ క్లినిక్ ద్వారా ఉచితంగా లబ్ధి పొందగా, ఈ సేవా విభాగం సుమారు 40 మంది వైద్యులు, 60 మందికి పైగా సర్టిఫైడ్ వాలంటీర్లు , 80 మంది యువ వాలంటీర్ల నిరంతర కృషితో నడుస్తోంది. 5K వాక్ ముఖ్యాంశాలు... తేదీ , సమయం: ఆగస్టు 8వ తేదీ, శనివారం ఉదయం 8:00 గంటలకు ఈ నడక ప్రారంభమవుతుంది. వాక్ రోజు ఉదయం 7:30 గంటల నుండే ప్యాకెట్ పికప్, టీ-షర్ట్ , బిబ్ పంపిణీ ఉంటుంది. వేదిక: కాళీ క్రీక్ పార్క్ (Cauley Creek Park), 7255 బెల్ రోడ్, జాన్స్ క్రీక్, జార్జియా (GA 30097). రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు: జులై 25 లోపు పేరు నమోదు చేసుకునే అర్లీ బర్డ్ అభ్యర్థులకు పెద్దలకు $25, పిల్లలకు $15 గా నిర్ణయించారు. జులై 25 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెద్దలకు $30, పిల్లలకు $20 ఫీజు ఉంటుంది. రిజిస్ట్రేషన్ వెబ్సైట్: ఆసక్తి గల వారు Tama.org/clinicwalk ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత బ్రేక్‌ఫాస్ట్ , కూల్ డ్రింక్స్ అందిస్తారు. ఈ భారీ సామాజిక కార్యక్రమ పర్యవేక్షణను టామా ప్రతినిధులు నగేష్ దొడ్డక, శ్రీని రామనాథం, ప్రియ బాలుసులతో పాటు టామా ప్రెసిడెంట్ సునీత పొట్నూరు (404-988-9429), టామా చైర్మన్ మధుకర్ యార్లగడ్డ (+1 913-609-3563) చూసుకుంటున్నారు. అట్లాంటాలోని ప్రవాస తెలుగు కుటుంబాలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ 5K వాక్‌ను విజయవంతం చేయాలని టామా కమిటీ పిలుపునిచ్చింది.