
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 12 ఏళ్ల పాలనను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొనియాడారు. ఆయన తన దార్శనిక నాయకత్వంతో దేశంలో ఎన్నో మార్పులకు నాందిపలికారని
ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్లపాటు భారత్ (India)కు దార్శనిక నాయకత్వం అందించినందుకు ఆయనకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుష్కరకాలంలో ఆయన నిర్ణయాత్మకమైన పాలన ఎన్నో సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చింది. దేశం, రాష్ట్రాభివృద్ధికి ఆయన అందిస్తున్న నిరంతర మద్దతు, మార్గదర్శకత్వానికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వికసిత్భారత్ వైపు సాగే ఈ ఉమ్మడి ప్రయాణంలో భావితరాల కలలను సాకారం చేసేందుకు నావంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు.