Bonus Issue: స్మాల్ క్యాప్ కేటగిరిలోని బ్యాంకింగ్ సెక్టార్ సంస్థ సిటీ యూనియన్ బ్యాంకు లిమిటెడ్ ( City Union Bank Limited ) బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఈ బ్యాంక్ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే తమ షేర్
హోల్డర్లు బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 1:3 రేషియోలో బోనస్ షేర్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే ఇందుకు సంబంధించిన రికార్డు డేట్ జూన్ 12గా నిర్ణయించారు. ఈ తేదీన షేర్లు ఎక్స్-బోనస్ ట్రేడ్ చేయనున్నాయి. అంటే జూన్ 11వ తేదీలోపు షేర్లు కొనుగోలు చేసి ఉన్న వారికి మాత్రమే అర్హత లభిస్తుంది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం ప్రతి 3 ఈక్విటీ షేర్లకు అదనంగా 1 ఈక్విటీ షేరు బోనస్ రూపంలో ఇస్తారు. దీని అర్ధం మీ వద్ద 300 షేర్స్ ఉంటే 100 షేర్స్ ఉచితంగా వస్తాయి. మరోవైపు ఈ బ్యాంకు షేర్ గత ఏడాదిలో 27 శాతం లాభాన్ని అందించింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై 1:3 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీని అర్థం రికార్డు డేట్ లోపు ఎవరైతే రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 3 ఈక్విటీ షేర్స్ కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటారో, వారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేర్ బోనస్ గా ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ ని జూన్ 12, 2026గా నిర్ణయించారు. ఈ బోనస్ ఇష్యూలో అర్హత సాధించాలంటే ఇవాళ ఒక్కరోజే అవకాశం ఉంటుంది. అలాగే బోనస్ ఇష్యూ ప్రకారం స్టాక్ ధర సైతం తగ్గుతుంది. కానీ, షేర్ల సంఖ్య పెరుగుతుందని షేర్ హోల్డర్లు గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో సిటీ యూనియన్ బ్యాంకు షేరు ధర 1.03 శాతం నష్టంతో రూ. 253.75 వద్ద ముగిసింది. కానీ, జూన్ 11వ తేదీ ట్రేడింగ్ లో ఈ స్టాక్ 2.19 శాతం లాభంతో రూ.259 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 324.10 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 187.05 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 5 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 1.50 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో 2 శాతం నష్టపోయింది. గత ఏడాది కాలంలో 29 శాతం పెరిగింది. గత ఏడాదిన్నర కాలంలో 50 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు మార్కెట్ విలువ సుమారు రూ. 19,190 కోట్లుగా ఉంది.