ఆల్కహాల్ తాగడంతో పాటు అనేక కారణాల వల్ల కాలేయంలో కొవ్వు పెరిగి లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కాలేయంలోని కొవ్వు కరిగించుకోవడం చాలా అవసరం
. దీనికోసం ఉదయం పూట కొన్ని డ్రింక్స్ తాగడం మంచిదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.ఈశ్వర్ అమలజారి (స్పర్ష్ హాస్పిటల్, యశ్వంతపూర్, బెంగళూర్) తెలిపారు. ఆ వివరాలు చూద్దాం.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలో ఎంజైమ్స్ పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా కాలేయంలోని కొవ్వును కరిగిపోయేలా చేస్తాయి. అందుకే ఉదయం పూట ఓ కప్పు గ్రీన్ టీ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
కాలేయంలోని ఎంజైమ్స్‌పై ప్రభావం చూపి కొవ్వు కరిగించడంలో నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే సరిపోతుంది.
రోజూ ఉదయం ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగితే కాలేయంలోని కొవ్వు కరిగిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తద్వారా లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
బీట్రూట్ రసంలో బీటలైన్స్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పననిచేసి కాలేయంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. లివర్ హెల్త్‌ను కాపాడుతాయి.
ఉసిరిలో విటమిన్ సితో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును కరిగిస్తాయి. అలాగే లివర్‌ను డీటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. దీనికోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉసిరి రసం కలిపి ఖాళీ కడుపుతో తాగితే మంచిది.
ప్రతిరోజూ ఉదయం పూట గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు కలిపి తాగితే చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని కొవ్వును కరిగిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తాయి.
అల్లం టీని ఉదయం పూట తాగడం వల్ల మెటబాలిజం రేటు మెరుగుపడి కొవ్వు తొందరగా కరిగిపోతుంది. అలాగే కాలేయంలో మంట, వాపు తగ్గుతుంది. అందుకే రోజూ ఉదయం ఓ కప్పు అల్లం టీ తాగడం మంచిది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంతో పాటు కాలేయాన్ని డీటాక్సిఫై చేయడంలో జీలకర్ర నీళ్లు సహాయపడతాయి. దీనికోసం నీళ్లలో జీలకర్ర బాగా మరిగించి తాగితే సరిపోతుంది.