
మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ
Jun 11 2026 1:02 PM | Updated on Jun 11 2026 1:09 PM
మదనపల్లె టౌన్ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది.
వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్ సరి్టఫికెట్ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది.
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సాకర్ సమరానికి వేళాయే.. నేటి నుంచే ఫుట్‌బాల్ పండగ (ఫోటోలు)
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
ఫుట్ బాల్ ముందు క్రికెట్ జుజుబీ ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు తెలుసా ..?
ఏపీలో కూడా కాక్రోచ్ లు వస్తాయి జాగ్రత్త.. లోకేష్‌కు జగన్ వార్నింగ్
15 లక్షలు ఇస్తే జాబ్ మీ చెల్లికి ఇస్తాం.... సంచలన ఆడియో లైవ్ లో ప్లే చేసి..!
చెవులో పువ్వులు.. కాకమ్మ కథలు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు...
నందు కేసులో కొత్త ట్విస్ట్.. రాజీనామాపై అనేక అనుమానాలు..!