
సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సినిమాల్లో నటించి హీరోయిన్ గా వెలుగు వెలిగారు. ఆ తర్వాత తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. చాలా ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత రోజా రాజకీయాల్లో విజయం సాధించారు. వైసీపీ హయాంలో
మంత్రి కూడా అయ్యారు. గత ఎన్నికల్లో రోజా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. రోజా గతంలో జబర్దస్త్ షోకి హోస్ట్ గా కూడా చేశారు. ఇటీవల ఆమె బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ అంతగా కనిపించడం లేదు.
ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ అనుష్క శెట్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలకు సమయం కేటాయించడం చాలా కష్టం. కానీ నేను ఇప్పటికీ ఎలాంటి పాత్రలో అయినా నటించగలను. అయితే ఇప్పుడున్న పరిసస్థితుల్లో మాత్రం అనుష్క నటించే తరహాలో సినిమాలు చేయాలని ఉంది. అనుష్క నటించిన అరుంధతి మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆమె పాత్ర ట్రెడిషనల్ గా ఉంటూనే పవర్ ఫుల్ గా ఉంటుంది.
అదే విధంగా ఆమె నటించిన రుద్రమదేవి చిత్రం అంటే కూడా ఇష్టం. అలాంటి చిత్రాలు వస్తే నేను కూడా చేయగలను అని రోజా అన్నారు. బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయితే నేను తల్లి పాత్రలో నటిస్తే ఒక సమస్య ఉంది. నా నవ్వు అంటే అందరికీ చాలా ఇష్టం. ఆ నవ్వే నాకు మైనస్ గా కూడా మారుతోంది.
నేను మొగుడు, శంభో శివ శంభో, గోలీమార్ లాంటి చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించాను. ఆ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు నా నవ్వు చూసి మీరు అప్పుడే తల్లి పాత్రలు ఎందుకు చేస్తున్నారు. హీరోయిన్ గా చేయొచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ చిత్రాల్లో నాకు తల్లి పాత్రలు సెట్ కాలేదు. అందుకే ఆ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి ని రోజా అన్నారు.
రోజా తెలుగు సినిమాల్లో నటించి పదేళ్లుపైనే అవుతోంది. రోజా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోలతో నటించింది. భైరవద్వీపం, బొబ్బిలి సింహం లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.