
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Ts Police Recruitment Latest News: తెలంగాణలో కొలువుల వేటలో ఉన్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా భారీ భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 19వేల కంటే ఎక్కువ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఇందులో భాగంగా తొలి విడత సుమారు 5000 పోస్టుల భర్తీకి అడుగులు పడుతున్నాయి.. ఐదు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మొదటి విడత కింద భర్తీ చేయబోతున్న ఐదు వేల కానిస్టేబుల్‌తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన సమగ్ర నివేదికను పోలీస్ నియామక బోర్డు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారికంగా ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం.. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి.. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతను
ప్రతిష్ట చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను, అలాగే ఈగల్ ఫోర్స్ ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఎంపికయ్యే అభ్యర్థులకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు టెక్నికల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నట్లు సమాచారం..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్.. గత కొంతకాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ఈ వార్త పెద్ద ఊరటన ఇస్తోంది.. నోటిఫికేషన్ వెలుపడే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులు అప్పుడే కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.. అంతేకాకుండా తమ శారీరక, రాత పరీక్షల సాధనను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో పాటు వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేయడం ఖాయమని కనిపిస్తోంది.. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.