
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Telangana Govt Telugu Latest News: సమాజంలో తీవ్ర వివక్షకు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక, మానవయ్య నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ట్రాన్స్ జెండర్లకు లింగమార్పిడి చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కీలకమైన కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఉచితంగా శస్త్రచికిత్స.. సాధారణంగా లింగ మార్పిడి ప్రక్రియ అనేది సుదీర్ఘమైనది, అత్యంత ఖరీదైనది.. దీనికోసం నిర్వహించే హార్మోనల్ తెరపి తో పాటు SRS సర్జరీలకు ఖర్చులను సాధారణ ప్రజలు భరించడం దాదాపు అసాధ్యం.. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి ప్రత్యేక లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా అర్హులైన ట్రాన్స్ జెండర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలతో పాటు మందులు అందుతాయి..
కార్పొరేట్ స్థాయి వైద్యం.. ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ తరహా లింగమార్పిడి సర్జరీలకు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. సరైన వైద్య సదుపాయాలు లేని చోట తక్కువ ఖర్చులతో సర్జరీలు చేయించుకొని ఎంతోమంది ట్రాన్స్ జెండర్లు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించి.. వారికి అధునాతన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిరుపేద ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం పెద్ద అండగా నిలిచింది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ప్లాస్టిక్ సర్జరీలు కూడా.. ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటికే ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకమైన క్లినిక్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ ఉచిత సర్జరీల నిర్ణయంతో ప్లాస్టిక్ సర్జరీలతో పాటు ఎండోక్రినాలజీ, సైకియాట్రీ, గైనకాలజీ విభాగాల నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆధ్యాధునిక శాస్త్ర చికిత్సలు జరగబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయంపై ట్రాన్స్ జెండర్ హక్కుల సంఘాలతో పాటు సామాజిక విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తాము గౌరవంగా బ్రతకడానికి ఇదొక గొప్ప అవకాశం అని వారు కొనియాడుతున్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.