
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్ రేసు నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే రాజస్థాన్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ డగౌట్లో కన్నీటిపర్యంతమైన దృశ్యాలే అభిమానులను తీవ్రంగా కదిలించాయి. ఒంటిచేత్తో జట్టును గెలిపించేందుకు అద్భుత పోరాటం చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.చండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104 నాటౌట్), సాయి సుదర్శన్ (58) రాణించడంతో 18.4 ఓవర్లలోనే విజయం సాధించింది.ఈ సీజన్ ఆసాంతం రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని తన లేత భుజాలపై మోసిన వైభవ్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డగౌట్లో తలదించుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ.. డగౌట్లో కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు. కెమెరాలకు తన ముఖం కనిపించకుండా టవల్ అడ్డుపెట్టుకుని ఏడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్