
Drishyam ౩: మలయాళ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న ‘దృశ్యం 3’ చిత్రం ఇప్పుడు ఓ కొత్త వివాదంతో వార్తల్లో నిలిచింది. సినిమాలో చూపించిన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ తనదేనని ఆరోపిస్తూ
ఇడుక్కి జిల్లాకు చెందిన రాజీవ్ పోలీసులను ఆశ్రయించాడు.
కుంచితన్నీ ప్రాంతానికి చెందిన రాజీవ్ తన ఫిర్యాదును మున్నార్ డీఎస్పీకి సమర్పించాడు. సినిమాలో మోహన్‌లాల్ పాత్ర ఉపయోగించిన వాహనంపై కనిపించిన నంబర్ తన వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో పూర్తిగా సరిపోతుందని పేర్కొన్నాడు. తన వాదనకు మద్దతుగా వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) ప్రతిని కూడా అధికారులకు అందజేశాడు.
Read also: June 2026 Telugu Movie Releases: జూన్ నెలలో థియేటర్లను షేక్ చేయనున్న ఆసక్తికర చిత్రాలివే!
సినిమాలో కనిపించే అన్ని సన్నివేశాల నుంచి ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తొలగించాలని రాజీవ్ డిమాండ్ చేశాడు. ఈ అంశం కారణంగా భవిష్యత్తులో తనకు అనవసర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
‘దృశ్యం 3’పై చర్చలు పెరిగిన తర్వాత చాలా మంది తన వాహనాన్ని సినిమా వాహనంగా గుర్తిస్తున్నారని రాజీవ్ వెల్లడించాడు. ముఖ్యంగా యువత నుంచి ఈ విషయంలో ఎక్కువ స్పందన వస్తోందని తెలిపాడు. దీంతో తనకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నాడు. రాజీవ్ వద్ద ఉన్న వాహనం మహీంద్రా స్కార్పియో కాగా, సినిమాలో చూపించిన వాహనం మరో బ్రాండ్‌కు చెందినదని సమాచారం. అయితే వాహనాలు వేర్వేరు అయినప్పటికీ, రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రం తనదేనని ఆయన స్పష్టం చేశాడు.
సినిమా నిర్మాణ బృందం తనను ముందుగా సంప్రదించలేదని, నంబర్ వినియోగానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని రాజీవ్ ఆరోపించాడు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోకపోతే నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్, దర్శకుడు జీతూ జోసెఫ్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించాడు.
AI Data Center : రిలయన్స్ తో టై-అప్.. దేశంలో మెటా తొలి ఏఐ డేటా సెంటర్
Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Peddi Ticket Issue : హైకోర్టు కు చేరిన ‘పెద్ది’ టికెట్ పెంపు వ్యవహారం !
peddi movie: ‘పెద్ది’ సక్సెస్.. బన్నీ పోస్ట్‌పై రామ్ చరణ్ క్రేజీ రిప్లై!
Peddi Box Office Collections:బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం!రూ. 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
NBK111 Movie Updates: NBK111 గ్లింప్స్.. బాలయ్య కొత్త అవతార్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
Peddi Movie: నకిలీ నోట్లతో పెద్ది సినిమా చూసిన ప్రేక్షకులు
Alia Bhatt Alpha Movie Teaser:‘ఆల్ఫా’గా అలియా భట్ యాక్షన్ విధ్వంసం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ప్రోమో అవుట్!