
ఇంటర్నెట్ డెస్క్: మద్యం మత్తులో నైట్ క్లబ్లో ఓ రగ్బీ ఆటగాడితో గొడవపడిన నేపథ్యంలో బెన్‌స్టోక్స్, గస్ అట్కిన్సన్ జట్టులో స్థానంలో కోల్పోయారు. వీరు జూన్ 17 నుంచి 21 మధ్య ఓవెల్ వేదికగా
న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు దూరం కానున్నారు. సీనియర్ బ్యాటర్ జోరూట్ ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డ్ తెలిపింది.
‘బెన్‌స్టోక్స్, గస్ అట్కిన్సన్పై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న దృష్ట్యా వారు న్యూజిలాండ్‌తో జూన్ 17 నుంచి జరగనున్న రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండటం లేదని. ది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ ధ్రువీకరించింది. ఇంగ్లాండ్ జట్టుకు జోరూట్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు’ అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. జోఫ్రా ఆర్చర్, జార్డన్ కాక్స్ జట్టుతో చేరనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.