
పశ్చిమాసియా ఘర్షణల వేళ.. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై బుధవారం దాడి జరిగింది. పలావు జెండాతో బయల్దేరిన సెట్టెబెల్లో నౌక లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈక్రమంలో నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని
సహాయక సిబ్బంది రక్షించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొంది. గాలింపు, సహాయక చర్యల విషయంలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించింది. నౌకపై దాడి.. ముగ్గురు భారతీయుల గల్లంతు |