
ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో భారతీయులున్న మరో నౌకపై బుధవారం దాడి జరిగింది. పలావు జెండాతో బయల్దేరిన వాణిజ్య నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిని భారత విదేశాంగ శాఖ
ఖండించింది. నౌకలోని 24 మంది భారతీయుల్లో 21 మందిని సహాయక సిబ్బంది రక్షించారని, మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొంది. వీరికోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. పరిస్థితులను భారత రాయబార కార్యాలయం నిశితంగా పర్యవేక్షిస్తోందని, రెస్క్యూ ఆపరేషన్‌పై ఒమన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించింది.
‘‘ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండిస్తున్నాం. గల్లంతైన ముగ్గురు భారతీయులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో నౌకా రవాణాపై నిరంతరం దాడులు జరుగుతుండటం ఆందోళన కలిస్తోంది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని.. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాం. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే చర్యలకు ముగింపు పలకాలి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. అమెరికా చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి నాగరాజ్ నాయుడు.. అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరికొద్ది రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టోర్నీ దగ్గరపడుతున్న కొద్దీ కేరళలోని సాకర్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.