
హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి)
: హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. మృతులను భువనేశ్వరి (17), సంధ్యా (10)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆదివారం రోజు ఇంటి సమీపంలో ఉన్న మామిడి పండ్లను తిన్న అనంతరం ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు.
మరుసటి రోజు నుంచి వాంతులు, విరేచనాలతో వారు బాధపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం భువనేశ్వరి మృతిచెందగా, మంగళవారం సంధ్యా కూడా ప్రాణాలు కోల్పోయింది. వరుసగా ఇద్దరు బాలికలు మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
ఈ ఘటన ఫుడ్ పాయిజన్ కారణంగానే జరిగిందా..?, లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాలికలు తిన్న ఆహారం, మామిడి పండ్ల నమూనాలను పరిశీలించే అవకాశం ఉంది. పూర్తి వైద్య నివేదికలు, పోస్టుమార్టం ఫలితాలు వచ్చిన తర్వాతే మరణాలకు గల అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్రెడ్డి
కిషన్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News