
నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు అతడితో పాటు నైట్‌క్లబ్ వివాదంలో మరో నిందితుడు గస్
Jun 10 2026 8:22 PM | Updated on Jun 10 2026 8:46 PM
నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు అతడితో పాటు నైట్‌క్లబ్ వివాదంలో మరో నిందితుడు గస్ అట్కిన్సన్ను కూడా జట్టు నుంచి తప్పించారు. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.
లార్డ్స్ టెస్ట్‌లో విజయానంతరం స్టోక్స్, అట్కిన్సన్లు లండన్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. వీరిద్దరు జట్టుకు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించి అక్కడ ఉండగా, ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ECB విచారణ చేపట్టిన తర్వాత ఇద్దరినీ రెండో టెస్ట్‌కు ఎంపిక చేయలేదు.
దీంతో 2022లో స్టోక్స్‌కు కెప్టెన్సీ అప్పగించిన మాజీ సారథి జో రూట్ మళ్లీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన రూట్వైపే ECB మొగ్గుచూపింది.
స్టోక్స్ స్థానంలో జోర్డన్ కాక్స్, అట్కిన్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ తర్వాత ఆర్చర్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.
కాగా, నైట్ఫైట్ తర్వాత స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అతడు ఇప్పటికే వన్డే, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజా ఉదంతం తర్వాత స్టోక్స్ క్రికెట్ కెరీర్ మొత్తానికే గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ జూన్ 17 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మొదలుకానుంది.
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు.. రూట్ (C), డకెట్, గే, బేతెల్, బ్రూక్, స్మిత్ (WK), రూ, కాక్స్, రెహాన్, రాబిన్సన్, జోఫ్రా, టంగ్, ఫిషర్, బేకర్, బషీర్
కలర్‌ఫుల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత.. ఫోటోలు
దర్శక దిగ్గజం భారతీ రాజాకు సినీ ప్రముఖుల నివాళి.. ఫోటోలు
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం...ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
అందంతో కిక్కెక్కిస్తున్న భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
వరంగల్ : కనుల పండువగా ఎస్సార్ స్నాతకోత్సవం (ఫొటోలు)
జ్ఞానేశ్వరి కేసులో అనుమానాలు.. కుక్క ప్రవర్తనలో మార్పు!
ప్రమాదం ముందే తెలుసు.. బయటపెట్టిన వాట్సాప్ స్టేటస్