
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. తాను క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి నాళ్ల రోజుల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అప్పట్లో జనాలకు భారత్‌లో మహిళలు
క్రికెట్ ఆడతారనే విషయమే తెలిసేది కాదన్నారు. 1990ల సమయంలో వుమెన్స క్రికెట్‌కు పెద్దగా గుర్తింపు ఉండేది కాదని వెల్లడించారు. క్రికెట్ కిట్ బ్యాగ్‌ను చూసి జనాలు హాకీ బ్యాగ్ అని పొరబడుతుండేవారన్నారు.
‘‘నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. భారత్‌లో చాలా మందికి మహిళలు క్రికెట్ ఆడతారనే విషయం తెలియదు. జనాలు నా క్రికెట్ బ్యాగ్‌ను చూసి నన్ను.. ‘మీరు హాకీ ఆడతారా?’ అని అడిగేవారు. వారిలో ఒక్కరు కూడా నన్ను క్రికెటర్ అనుకునే వారు కాదు. అలాగే.. అప్పట్లో మహిళలు వీధుల్లో క్రికెట్ ఆడుతూ ఎప్పుడూ మాకు కనిపించలేదు. బహుశా అప్పుడు వారు క్రికెట్ ఆడేవారు కాదేమో’ అని వివరించారు.
‘మహిళల క్రికెట్ 2007 నుంచి బీసీసీఐ పరిధిలో ఉంది. అంతకు ముందు మహిళల క్రికెట్ మనుగడ అనేది ఒక పోరాటంలానే ఉండేది. మేం ఆడుతున్నప్పుడు అవకాశాలను సృష్టించుకోవాల్సిన పరిస్థితి. క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాల్సి వచ్చేది. అలాగే ప్రజలను క్రికెట్ వైపు ఆకర్షించడానికి వ్యక్తిగత ప్రతిభ కీలక పాత్ర పోషించేది’ అని ఆమె అన్నారు. అలాగే ఐసీసీ వుమెన్స్ టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు పలు సూచనలు చేశారు. ‘విశాల దృక్పథంతో నేర్చుకోవడానికి సుముఖత చూపించాలి. నా సలహా ఏమిటంటే.. అప్రమత్తంగా ఉండండి. పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉండండి’ అని ఆమె అన్నారు. మరో రెండు రోజుల్లో ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌తో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తలపడనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.