
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
TMC Merge In Congress: అధికారం కోల్పోయిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాలు పార్టీని నడుపుతూ తిరుగులేని నాయకురాలిగా నిలిచిన మమతా బెనర్జీకి ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి. గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమనడంతోపాటు గ్రూపుల చొప్పున పార్టీ నిలువునా చీలిపోయింది. అసెంబ్లీలో, లోక్‌సభ, రాజ్యసభ ఇలా పార్టీ మూడు ముక్కలైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ భేటీలో తృణమూల్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుసతోంది.
కొన్ని నిమిషాల పాటు చర్చలు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ సోనియాతో మమతా బెనర్జీ సమావేశమై కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై సమాలోచనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చర్చ జరుగుతోంది. సోనియా గాంధీతో జరిగిన వ్యక్తిగత సమావేశంలో మమతా బెనర్జీ కీలక విషయాలు మాట్లాడినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
విలీనం ప్రతిపాదన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట.. గ్రూపు రాజకీయాలు.. పార్టీ చేజారిపోయే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌లో విలీనం అనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. తృణమూల్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థతుల్లో విలీనం ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని సోనియా గాంధీ ఆహ్వానించినట్లు జాతీయా మీడియా చెబుతోంది. బీజేపీ చేస్తున్న రాజకీయంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతోంది.
ఒంటరిగా ఉంటే మరిన్ని వేధింపులు తప్పవని.. అసలు ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండడంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. తృణమూల్ విలీనం అయితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని.. అందరూ కలిసికట్టుగా ఉంటే బీజేపీతో పోరాడే శక్తి వస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని విలీనంపై ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో గౌరవం ఎలా? కాంగ్రెస్ పార్టీ చేసిన విలీన ప్రతిపాదనపై మమతా బెనర్జీ అప్పటికప్పుడు ఏం చెప్పలేకపోయారు. విలీనంపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని.. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ తృణమూల్ విలీనమైతే మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీలో ఎలా గౌరవించాలి? ఏ పదవి ఇవ్వాలనేది? కూడా ఇప్పటికే హస్తం పార్టీ సమాలోచనలు చేస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి మమతకు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక ఆమె మేనల్లుడు, తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చనే వార్తలు వస్తున్నాయి.
అభిషేక్ బెనర్జీ- రాహుల్ గాంధీ భేటీ పరిస్థితి ఇలా ఉంటే మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అభిషేక్, రాహుల్ భేటీలో కూడా పార్టీ విలీనంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఇలా అన్నింటినీ వీరిద్దరూ కొన్ని నిమిషాలు చర్చించినట్లు సమాచారం.