
బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఫ్యూచర్ సిటీని రద్దు
చేస్తామని కొందరు అంటున్నారు. ఇది మన కోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచం కోసం. బీఆర్ఎస్ రద్దయిన వెయ్యి నోటు. ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు’’ అని రేవంత్రెడ్డి అన్నారు. బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువెక్కువ: రేవంత్రెడ్డి |