
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఫాస్ట్లేన్గా రీబ్రాండ్ చేసింది (Airtel Fast Lane). వెబ్సైట్, మొబైల్ యాప్‌లో ఈ మేరకు
మార్పులు తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పేరు మాత్రమే మారిందని, సేవల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని కంపెనీ స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల 5జీ స్లైసింగ్‌లో భాగంగా ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌ను ఎయిర్టెల్ తీసుకురాగా.. అది కాస్తా చర్చనీయాంశమైంది. నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకమన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో పేరు మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘పోస్ట్‌పెయిడ్ లాంచ్ క్యాంపెయిన్ ముగిసింది. బ్రాండ్ పేరు మాత్రమే మారింది. 5జీ స్లైసింగ్ ప్లాన్‌లో, ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులూ ఉండవు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ఫాస్ట్‌లేన్ విధానం వల్ల ప్రీపెయిడ్ యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదు’’ అని ఎయిర్టెల్ ప్రతినిధి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.