
కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి దాఖలు చేసిన ఆమె నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో
కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించింది.తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఓ కేసు వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదనే కారణంతో నామినేషన్ను తిరస్కరించారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. హైదరాబాద్లోని కోర్టు జారీ చేసిన నోటీసు కేవలం ప్రాథమిక విచారణలో భాగమే తప్ప, ఆమెపై అధికారిక క్రిమినల్ కేసు నమోదు కాలేదని చెబుతోంది. ఇంకా కోర్టు నేరాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ఎలాంటి అభియోగాలు కూడా నమోదు కాలేదని పేర్కొంటోంది.ఈ వివాదానికి కేంద్రంగా నిలిచింది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33ఏ. దీని ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరానికి సంబంధించి కోర్టు అభియోగాలు నమోదు చేసిన కేసులు ఉంటే వాటిని అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో వెల్లడించాలి. అలాగే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన తీర్పులు ఉంటే కూడా తెలియజేయాలి.న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం ప్రాథమిక విచారణ దశలో ఉన్న వ్యవహారాలను వెల్లడించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో కేసు పూర్తిస్థాయిలో ప్రారంభమైనట్లు పరిగణించరు. మీనాక్షి నటరాజన్ విషయంలో హైదరాబాద్ కోర్టు జారీ చేసిన నోటీసు వెల్లడించాల్సిన కేసు పరిధిలోకి వస్తుందా? లేక అది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమేనా? అన్న అంశంపైనే ఇప్పుడు మొత్తం