
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విద్యాసంస్థ రానుంది. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో గుర్తింపు పొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) అమరావతిలో తన విద్యాసంస్థను
స్థాపించేందుకు ముందుకొచ్చింది.
అమరావతి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విద్యాసంస్థ రానుంది. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో గుర్తింపు పొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) అమరావతిలో తన విద్యాసంస్థను స్థాపించేందుకు ముందుకొచ్చింది.ఈ మేరకు బుధవారం GIIS K12 ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ సీఆర్డీఏ (CRDA) మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. సీఆర్డీఏ తరఫున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ రాయ్, GIIS తరఫున కంట్రీ డైరెక్టర్ రాజీవ్ కౌల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ప్రాజెక్టు కోసం అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామంలో 4 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన పాఠశాల క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు GIIS ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, క్రీడా మౌలిక వసతులు, సమగ్ర అభ్యాస వాతావరణంతో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. GIIS వంటి అంతర్జాతీయ విద్యాసంస్థ అమరావతిలో ఏర్పాటు కావడం వల్ల రాజధాని ప్రాంతంలో విద్యారంగానికి కొత్త ఊపునివ్వనుంది.
అమరావతిలో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో GIIS రాక రాజధాని అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. దీంతో విద్యారంగంతో పాటు రియల్ ఎస్టేట్, ఉపాధి అవకాశాలు, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉంది.
2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం
లోకేశ్‌పై జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News