
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Balakrishna Birthday:నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు భారీ సర్ప్రైజ్ అందింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం NBK111 నుంచి మేకర్స్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య అభిమానులు ఈ గ్లింప్స్‌ను తెగ షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
గ్లింప్స్‌లో బాలకృష్ణ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఇప్పటివరకు చూడని విధంగా చాలా స్టైలిష్‌గా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బైక్‌పై కూర్చొని చేతిలో గన్ పట్టుకుని కనిపించిన షాట్ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఆ సీన్లో బాలయ్య స్టైల్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన "వీరసింహారెడ్డి" బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో NBK111పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వెంకట్ సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
గ్లింప్స్‌కు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి షాట్‌కు ఆయన ఇచ్చిన స్కోర్ వీడియోను మరింత ఎలివేట్ చేసింది. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ స్టైల్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
మొత్తానికి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన NBK111 గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా బైక్‌పై గన్‌తో కనిపించిన బాలయ్య లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సత్తా చాటుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.