
ఇంటర్నెట్ డెస్క్: ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా పార్టీని వీడుతుండడంతో టీఎంసీ (TMC)... రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేయడం కోసం ఇటీవల జరిగిన ఇండియా కూటమి
సమావేశంలో ఇరుపార్టీల నేతలు చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలను పార్టీ నేతలు కొట్టిపడేశారు. కాగా ప్రస్తుతం మమతా బెనర్జీతో ఉన్న టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నేతృత్వంలో నేడు కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీతో రహస్యంగా సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్లో టీఎంసీ విలీనం కానుందనే వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా కాంగ్రెస్లో విలీనానికి టీఎంసీ నేతలే మొదట ప్రతిపాదన తెచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు ఎదురవుతుండడం, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఈ విలీనానికి మమత కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాంగ్రెస్ లోక్సభ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇరు పార్టీల విలీనానికి బహిరంగంగా పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష.. 12 ఏళ్ల పాలనపై మోదీ ఆసక్తికర పోస్టు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.