
ఇంటర్నెట్ డెస్క్: నీట్ (యూజీ) రీ-ఎగ్జామ్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఓ సర్క్యులర్‌పై ఎన్టీఏ (NTA) స్పందించింది. ఈ జాతీయ పరీక్ష
ప్యాటర్న్‌ను సవరించినట్లుగా జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. ఈ సర్క్యులర్ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఎన్టీఏ అలాంటి నోటీసు జారీ చేయలేదని పేర్కొంటూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లు, వేదికల్లో చెక్ చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది. నీట్ పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం, అప్డేట్స్ కోసం neet.nta.nic.in వెబ్సైట్లో చూడాలని కోరింది. (Fact Check)
రీ-ఎగ్జామినేషన్ విషయంలో పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. పేపర్ తయారీ నుంచి ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజీ, రవాణా, పంపిణీ వరకు అన్ని దశల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలుచేస్తున్నారు. పేపర్ రవాణా కోసం వాయుసేన విమానాలను వినియోగించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.