
తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంపునకు హోంశాఖ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి
మెమో ఇచ్చారని దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాదనల సందర్భంగా హోంశాఖ జారీ చేసిన మెమో అక్రమమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. టికెట్ ధరల పెంపు విషయంలో జీవో 121ను అనుసరించాలంది. తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. ‘పెద్ది’ టికెట్ ధరల పెంపు.. శిఖాగోయెల్పై కోర్టుధిక్కరణ పిటిషన్ |