
Realme P4R 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే, ఇప్పటికే
ఫ్లిప్‌కార్ట్ దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Realme P4r 5g Launched In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తూ వస్తుంది. ముఖ్యంగా P సిరీస్‌లో అందుబాటులోకి వచ్చిన చాలా మొబైల్స్ జనాలకి నచ్చడంతో.. వీటికి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రియల్ మీ కంపెనీ మార్కెట్లోకి మరో కొత్త P సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని కంపెనీ జూన్ 10వ తేదీ భారత దేశంలో అధికారికంగా విడుదల చేసింది..
ఈ Realme P4R 5G మొబైల్‌కు సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. రియల్ మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను MRP ధర రూ.25,999తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీనినే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి జూన్ 17వ తేదీన 25 శాతం స్పెషల్ ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.18,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
జూన్ 17వ తేదీన ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2,850 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది.
అలాగే ఎవరు ఊహించని విధంగా ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మీరు మీ దగ్గర ఉన్న పాత రియల్ మీ మొబైల్ ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా దాని కండిషన్‌ను బట్టి దాదాపు రూ.15 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.4 వేళలోపే పొందవచ్చు..
Realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ 8,000mAh బ్యాటరీతో విడుదల చేసింది అంతేకాకుండా ఒక్కరోజు చార్జి చేస్తే దాదాపు మూడు రోజులపాటు బ్యాకప్ అందిస్తుంది. అంతేకాకుండా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీనివల్ల ఎంతో స్పీడుగా బ్యాటరీని ఫుల్ చార్జింగ్ పెట్టొచ్చు..
ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో అద్భుతమైన 6.8 ఇంచుల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1200 nits పీక్ బ్రైట్నెస్ సపోర్టుతో రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అదేవిధంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300 5G) ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 తో పనిచేస్తుంది.