
Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్
అభిమానిగా తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని, ఆయన వాటికి సమాధానాలు చెప్పాలంటూ రాహుల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పెట్టిన పోస్టులు పెద్ద దుమారమే రేపాయి. నాటి నుంచి పవన్ అభిమానులు, జనసైనికులకు రాహుల్ టార్గెట్ అయ్యారు.
Read Also : Peddi Movie: నకిలీ నోట్లతో పెద్ది సినిమా చూసిన ప్రేక్షకులు
రాహుల్ రామకృష్ణ తన పోస్ట్‌లో.. “మీ గొప్పలు పక్కన పెడితే, సమాచార హక్కు చట్టం (RTI) కింద, మీరు నిర్వహించే శాఖల్లోని ప్రతీ విభాగంలో సమాచార బహిర్గతానికి సంబంధించి సెక్షన్ 4.1 (బి) అమలు చేశారా? PESA, 1/70 గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించి ఫలితాలను దయచేసి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం ఇవి అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నాను.. జై తెలంగాణ” అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నలపై పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడటంతో.. ప్రశ్నించినంత మాత్రాన తాను దేశద్రోహిని కానంటూ రాహుల్ మరో ట్వీట్ చేశారు. అలాగే ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేనెళ్లిపోతా’ అంటూ తన సినిమా డైలాగ్‌తోనే ఒక ఫన్నీ పోస్ట్ పెట్టారు.
జనసైనికుల నుంచి ట్రోలింగ్ రావడంతో రాహుల్ రామకృష్ణ ఆ పోస్టులన్నీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ పెట్టిన ట్వీట్లు ఆయన టైమ్‌లైన్‌లో కనిపించడం లేదు. అనంతరం ఆయన ”అందరం బాగుండాలి, అందులో నేనుండాలి” అంటూ మరికొన్ని పోస్టులు పెట్టారు. అయితే తాగి ట్వీట్లు పెడుతున్నారంటూ కామెంట్లు చేసిన నెటిజన్లకు రాహుల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. “ఒక 120 పదాల పోస్ట్ రాయాలంటే మత్తులో ఉండాలని గట్టిగా నమ్మే ఇక్కడి లేకలేనంత మంది వెర్రి కుర్రాళ్ల కోసం బ్రీత్ అలైజర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టమని నేను ‘X’ కి విజ్ఞప్తి చేస్తున్నాను. వారి అమాయకత్వాన్ని బట్టి చూస్తే అది ఈ ప్లాట్ఫామ్లో అత్యధికంగా ఉపయోగించే ఫీచర్‌గా మారుతుంది” అని ఎద్దేవా చేశారు. “అయినా ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో నేను డ్రింక్ ఎంజాయ్ చేయడమా?.. మీరు నాతో జోక్ చేస్తున్నారా!” అని స్పష్టం చేశారు.
“నువ్వు తీసిన సినిమాలకి నువ్వు చేసే ఇంటలెక్చ్యువల్ అతికి ఏమైనా సంబంధం ఉందా? ప్రశ్న వేశావు.. వెయ్యి మంది ప్రూఫ్‌తో కొట్టారు.. మళ్లీ కవర్ డ్రైవ్స్ ఎందుకు” అని ఓ నెటిజన్ ప్రశ్నించగా రాహుల్ బదులిస్తూ.. “నాకు ఎవరూ ఏ సమాధానం ఇవ్వలేదు బ్రదర్. నేనే గొడవ వద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వమంటే.. గొడవ, గోల, గలీజు మాటలు తప్ప సమాధానం ఏదీ రాలేదు” అని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన వీడియోను షేర్ చేస్తూ ఓ పవన్ ఫ్యాన్.. “ఏంటి మరి కథ.. ప్రశ్నించే దమ్ము ఉందా” అని రాహుల్‌ను ట్యాగ్ చేశాడు. దానికి రాహుల్ స్పందిస్తూ.. “గత వర్షాకాలం సీజన్లో నేను కొన్ని హానిచేయని ప్రశ్నలు అడిగినప్పుడు ఏమి జరిగిందో ఊహించండి. దమ్ము ఇప్పటికీ ఉంది బ్రదర్. జస్ట్ ఓపిక ఉంటలేదు, ఒంటరిగా నిలబడుతున్నా కాబట్టి” అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Ganja Seizure in Vijayawada : పనస పండ్ల లోడ్ చాటున గంజాయి స్మగ్లింగ్.. పోలీసులకు చిక్కిన ముఠా!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
NBK111 Movie Updates: NBK111 గ్లింప్స్.. బాలయ్య కొత్త అవతార్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
Nandamuri Balakrishna birthday: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
CM Vijay Emotional Tribute:భారతీరాజా నివాళిలో కన్నీరుమున్నీరైన తలపతి!
Bharathiraja Awards:చిన్నసామి నుండి పద్మశ్రీ భారతీరాజా వరకు..6 జాతీయ అవార్డులు, నంది పురస్కారాలు!
Nandamuri Balakrishna Birthday: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, బ్రాహ్మణి
Bharathiraja Death: దర్శకుడు భారతీరాజా మృతికి జగన్ ఘన నివాళి!