
ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవిలో అత్యధిక రోజులు ఉన్న నేతగా మోదీ రికార్డు సాధించారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు
తీసుకోనున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా..2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో టీడీపీకి కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు ఆఫర్ వచ్చింది. ఆ పదవి టీడీపీ నుంచి ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. ఎన్డీఏ భాగ స్వామ్య పార్టీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలను ఈ భేటీలో చర్చించి.. ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన పైనా మిత్రపక్షాలకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 12 మంది మంత్రులను తొలిగించి .. వారిలో కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులను గవర్నర్ గా పంపాలని పీఎం మోదీ నిర్ణయించినట్లు సమాచారం. ఇక, కేబినెట్ లో శాఖల మార్పు జరగనుంది. ప్రస్తుతం ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి.. బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజా మార్పు లు చేర్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వారికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.తల్లికి వందనం నిధుల జమ ముహూర్తం మార్పు,కిట్లు అప్పుడే - తాజా నిర్ణయం..!!లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే ఛాన్స్కాగా.. ఇదే సమయంలో మిత్రపక్షాల కు కేంద్రంలో కీలక పదవులు కేటాయింపు పైనా చర్చ జరుగుతోంది. అందులో భాగంగా టీడీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని పార్టీ నేతల సమాచారం. ఈ మేరకు తాజాగా ప్రతిపాదన పైన చర్చ జరుగుతోందని చెబుతున్నారు. ఈ పదవి కోసం టీడీపీ నుంచి అమలాపురం ఎంపీ హరీష్, బాపట్ల ఎంపీ క్రిష్ణ ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అమరావతికి చట్టబద్దత సమయంలోనూ క్రిష్ణ ప్రసాద్ స్పీకర్ స్థానంలో ఉన్న సమయంలో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే, గతంలో బాలయోగి స్పీకర్ గా పని చేసారు. ఇప్పుడు ఆయన తనయుడుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇవ్వాలనే ఆలోచన వేళ.. ఎవరికి ఇస్తారనేది సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.