
ప్రముఖ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మరణం తీరనిలోటని నటి ముచ్చర్ల అరుణ, నటుడు అలీ సంతాపం తెలిపారు. ప్రస్తుతం వాళ్లు ఓ కామెడీ షో షూటింగ్లో ఉన్న కారణంగా చెన్నైకి వెళ్లలేకపోయినందుకు బాధపడ్డారు
. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియో విడుదల చేశారు. తనకు నటిగా గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం భారతీరాజానే అని అరుణ భావోద్వేగానికి గురయ్యారు. భారతీ రాజా తనకు గురువుతో సమానమన్నారు. ‘సీతాకోకచిలుక’తో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే అని అలీ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం ఎంతో బాధాకరమన్నారు. ఈ వార్త చదివారా: ‘ఆమె’ అందానికి ముగ్ధుడై.... భారతీరాజా సినీ ప్రస్థానమిది..