
Revanth Reddy: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర
స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిణామం పూర్తిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పన్నిన రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. గతంలో ‘ఓట్ల దొంగతనానికి’ పాల్పడిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా ‘సీట్ల దొంగతనానికి’ తెరలేపిందని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ఇది వ్యవస్థలపై జరిగిన దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
తెలంగాణకు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీనాక్షి నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను స్క్రూటినీలో తిరస్కరించారు. అయితే ఈ అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ సీటును లాక్కోవడానికే బీజేపీ ఇలాంటి సాంకేతిక సాకులు వెతుకుతోందని ధ్వజమెత్తారు.
Read also: Heavy Rain In Hyd : నిన్నటి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన నగరవాసులు
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, అధికారులను కలవకుండా వారిని అడ్డుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. కాగా, ఈ వివాదంలో మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. మీనాక్షి నటరాజన్ అఫిడవిట్‌కు సంబంధించిన లోపాలను కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత నేతలే తమకు చేరవేశారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు తన నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ స్వయంగా స్పందించారు. దేశంలో ప్రతిపక్షాల ఉనికిని పూర్తిగా అణచివేయాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. విపక్షాలను దెబ్బతీసి, దేశంలో ఏక పార్టీ నియంతృత్వ పాలనను స్థాపించాలనే దురాలోచనతోనే అధికార పార్టీ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Heavy Rain In Hyd : నిన్నటి భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన నగరవాసులు
BJP : తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Trump Towers: హైదరాబాద్‌లో ‘ట్రంప్ టవర్స్’కు గ్రీన్ సిగ్నల్.. కోకాపేటలో సరికొత్త ల్యాండ్‌మార్క్
Fee Reimbursement : ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Wanaparthy Rice Mill Scam:శివ శివ..! రూ.2.5 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి!