
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవలే రష్యాలో జరిపిన పర్యటన, దాని ఫలితాలపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' జూన్
9న ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రవాణా, తయారీ, టెక్నాలజీ, స్మార్ట్ సిటీల వంటి కీలక రంగాల్లో కొత్త అవకాశాలు లభించనున్నాయని ఆ కథనం విశ్లేషించింది.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF) 2026 సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలతో ఆయన ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో అల్యూమినా స్మెల్టర్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టిన 'రుసాల్' (RUSAL) వంటి సంస్థలతో ఉన్న భాగస్వామ్యాన్ని సమీక్షించారు. అల్యూమినియం విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆటోమోటివ్, ఏరోస్పేస్ మిశ్రమ లోహాలు, ఫాయిల్ ఉత్పత్తి వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై చర్చించారు.పర్యటనలో భాగంగా ఇంధనం, లాజిస్టిక్స్, రవాణా, రైల్వేల తయారీ, క్రిటికల్ మినరల్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాల వంటి అనేక రంగాలకు చెందిన ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ముఖ్యంగా, మాస్కో రవాణా శాఖ మంత్రి, వైస్ మేయర్ మాగ్జిమ్ లిక్సుటోవ్తో భేటీ అయి, ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలు, స్మార్ట్ రవాణా పరిష్కారాలపై చర్చించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అధికారులతో సురక్షితమైన, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిర్మాణంలో సహకారం గురించి మాట్లాడారు.టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి