
Revanth Reddy: భాగ్యనగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన అధికారిక కార్యక్రమాలను ఆపకుండా ముందుకు సాగారు. మహిళల ఆర్థిక స్వాలంబన, సాధికారతే ప్రధాన
ధ్యేయంగా మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మహిళా శక్తి’ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన మంత్రివర్గ సహచరులతో కలిసి వేదికపైకి చేరుకున్న సీఎం.. మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) నిర్వహణ కోసం కేటాయించిన 553 నూతన ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
Read also: Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్
మహాసభ జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వాతావరణం అనుకూలించకపోయినా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు వర్షాన్ని లెక్కచేయకుండా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ లబ్ధిదారులైన మహిళా సంఘాల ప్రతినిధులను కలిసి, వారికి కొత్త బస్సులను అప్పగించడంతో పాటు, బస్సుల హైర్ ఛార్జీలకు సంబంధించిన అడ్వాన్స్ చెక్కులను స్వయంగా అందజేశారు.
మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగంగానే ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వినూత్న పథకం కింద మహిళా సంఘాలు కొనుగోలు చేసిన ఈ సరికొత్త బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కు లీజు ప్రాతిపదికన అప్పగిస్తారు. దీని ద్వారా ఆర్టీసీ చెల్లించే నెలవారీ అద్దెతో పొదుపు సంఘాల మహిళలకు శాశ్వత, స్థిరమైన ఉపాధి లభించనుంది.
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Valavaara Movie Review: ‘వలవార’ (జీ 5) సినిమా రివ్యూ
Peddi New Version: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో కీలక మార్పులు.. కొత్త వెర్షన్‌తో మరింత ఆకట్టుకునే ప్రయత్నం
AP Politics: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 41ఏ నోటీసులు!
Bullet train: ఇక ముంబై నుంచి హైదరాబాద్‌కు కేవలం 3 గంటల్లోనే
Dubai road accident: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం