
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయగా.. రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు
. కేసుల వివరాలను ఆమె అఫిడవిట్లో వెల్లడించకుండా దాచిపెట్టినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ కేసుల వివరాలను దాచిపెట్టినట్లు భాజపా చేసిన ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ తిరస్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలుల తీవ్రతకు రామ్‌నగర్‌లోని వీఎస్టీ రోడ్డులో, హైదర్‌గూడలో భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫొటోలు మీకోసం..
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో కిడ్నీ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి.