
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Rohit and Hardik Clears Fitness Test: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు ఫిట్నెస్ సాధించారు. ఈ నెల 13న, ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు.. ఈ ఇద్దరు ప్లేయర్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో ఫిట్నెస్ పరీక్షలను పూర్తి చేశారు. దీంతో ఈ స్టార్ ఆటగాళ్లకి సీఓఈ ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో, హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి సమస్యతో బాధపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరూ పలు మ్యాచ్‌లకు సైతం దూరంగా ఉన్నారు.
ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే హార్ధిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాడు. ఆ తరువాత బెంగళూరు వచ్చిన హార్దిక్ గత ఐదు రోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగా హార్దిక్ ఎటువంటి అసౌకర్యం లేకుండా మ్యాచ్ సిమ్యులేషన్స్ పూర్తి చేయడమే కాకుండా.. తన పూర్తి కోటా అయిన 10 ఓవర్లను అలవోకగా బౌలింగ్ చేశాడు. అతని శారీరక దృఢత్వాన్ని పరిశీలించిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు అన్ని పారామీటర్లలో అతని డేటా సంతృప్తికరంగా ఉందని క్లియరెన్స్ ఇచ్చారు.
మరోవైపు భారత మాజీ కెప్టెన్ రోహిత్ కూడా తన కండరాల నొప్పిని పరీక్షించుకోవడానికి CoE కి వెళ్లగా.. అతనికి కూడా పరీక్ష అనంతరం అనుమతి లభించింది. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే కండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమవ్వగా.. అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను తీసుకున్నారు. ధర్మశాలతో పాటు, ఈ సిరీస్‌లో భాగంగా జూన్ 17న లక్నోలో, జూన్ 20న చెన్నైలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.