
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Cobra Video Watch Here: మన మన భారతదేశం ఆధ్యాత్మికతకు అద్భుతాలకు నిలయం.. తరచుగా భక్తులను ఆశ్చర్యం కలిగించే సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియా వినియోగదారులతో పాటు శివ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఓ భారీ నాగుపాము.. ఓ దేవాలయంలోని శివలింగం చుట్టూ చుట్టుకుని దర్శనం ఇవ్వడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. అన్ని సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా కనిపిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శివలింగం పై నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించి చూస్తే.. ఒక పురాతన శివాలయంలోని గర్భగుడికి ముందుగా ఉన్న శివలింగానికి ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము చుట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము శివలింగంపై అటు ఇటు కదులుతూ.. తన పడగలను పైకెత్తి స్వామివారికి ఒక గొడుగుల పట్టినట్లు కూర్చుండిపోయింది. సాధారణంగా పాములను చూస్తేనే జనాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని ఆభరణమైన సర్పరాజే ఇలా శివలింగాన్ని అలంకరించి దర్శనం ఇవ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడున్న వారి తమ స్మార్ట్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
మహాశివరాత్రి వేళలో కూడా ఇలాంటి ఘటనలే.. ఇలాంటి వింతలు జరగడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ దేశంలోపాలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసాయి.. ముఖ్యంగా ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి పర్వదినం వేల లేదా శ్రావణమాసంలోని ప్రముఖ శివాలయాల్లో నాగుపాములు వచ్చి శివలింగంపై కూర్చోవడంతో పాటు భక్తులు ఇచ్చే పాలు తాగడం వంటి దృశ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం..
భక్తులు దీనిని దైవ లీలగా భావిస్తున్నారు.. సాక్షాత్తు భోళాశంకరుడే ఈ నాగుపాము రూపంలో దర్శనం ఇచ్చారని కొంతమంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. శివాలయాల్లో ఉండే ప్రశాంతతతో పాటు గర్భగుడిలోని చల్లదనం, అభిషేకాలు చేయడం వల్ల వచ్చే తేమ వైపు పాములు ఎక్కువగా ఆకర్షితమవుతాయని.. అందుకే అవి శివలింగాల పైకి చేరుకుంటాయని మరి కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. భక్తి, సైన్స్ పక్కన పెడితే.. సోషల్ మీడియా వినియోగదారులను మాత్రం ఈ అరుదైన వీడియో ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తూ వస్తోంది.. అయితే, ఈ వీడియో చూసిన మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జనరేట్ చేసిన ఒక ఫేక్ వీడియో అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.