
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Minister nara Lokesh visits Visakhapatnam steel plant blast victims family: విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై ఏపీ కూటమి ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ కిమ్స్, సెవన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లి మరీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరపున రూ 25 లక్షలు, గాయపడ్డవారికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అంతే కాకుండా చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటంబాల్ని పరామర్శించిన తర్వాత మంత్రి నారాలోకేష్ మీడియాలో మాట్లాడారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. కార్మికులకు భరోసా ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని, ఆరుగురు క్షతగాత్రులు అయ్యారన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రమాద స్థలాన్ని పరిశీలించి.. మృతి చెందిన వారికి 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మృతి చెందినవారి కుటుంబాలలో చదువుకున్న పిల్లలు ఉంటే పర్మినెంట్ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు. అంత్య క్రియలు అయిన తరువాత బాధిత కుటుంబాలతో మరోసారి సమావేశం అవుతున్నామని చెప్పారు. ప్రమాదంపై ఇప్పటికే నిపుణులుతో కమిటీ వేశామని, కమిటీ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తుందన్నారు.
Read more: Vizag Steel Plant Accident: విశాఖ ఉక్కు ప్రమాదం.. రూ.25 లక్షల భారీ పరిహారం ప్రకటించిన కేంద్ర మంత్రి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ!
ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి శ్రీనివాస్ ను పరామర్శించినప్పుడు విశాఖ ఉక్కును కాపాడాలని కోరారు. దీంతో నారా లోకేష్.. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రక్రియలో ఎక్కడ లోపం జరగలేదని, విశాఖ ఉక్కును కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. 90 రోజులలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని మంత్రి నారాలోకేష్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.