
Bear terror in Japan: జపాన్‌లో సుమారు 5 లక్షల జనాభా కలిగిన నగరంలో ఒక అడవి ఎలుగుబంటి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. దాని స్వైర విహారంతో ఏకంగా వందకు పైగా పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్
మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
జపాన్‌లోని ఉత్సునోమియా నగరంలో ఒక అడవి నల్ల ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించి, మూడు రోజుల పాటు వీధుల్లో తిరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ఒక పార్కు సమీపంలో 100 కేజీల బరువున్న ఆసియా నల్ల ఎలుగుబంటి మొదట కనిపించింది. ఆ తర్వాత అది నగరంలోని షాపింగ్ ఆర్కేడ్లు, నివాస ప్రాంతాలు, చివరకు అర్ధరాత్రి వేళ సీసీటీవీ కెమెరాల్లో ఒక వీధి గుండా పరిగెడుతూ కనిపించింది. నగర చరిత్రలోనే ఇలా ఎలుగుబంటి రావడం ఇదే మొదటిసారి.
Read also: EPFO: గుడ్ న్యూస్.. త్వరలోనే మీ అకౌంట్లోకి PF వడ్డీ డబ్బులు
ఎలుగుబంటి సంచారంతో అధికారులు నగర పరిధిలోని అన్ని 94 ప్రభుత్వ ప్రాథమిక, జూనియర్ హైస్కూళ్లను రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేశారు. ఎలుగుబంటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, స్థానిక హంటర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. నగర వీధుల్లో లౌడ్స్పీకర్లు ఉన్న వాహనాల ద్వారా.. ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, తలుపులు, కిటికీలు లాక్ చేసుకోవాలని అధికారులు నిరంతరం హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ మార్పుల వల్ల అడవుల్లో ఎలుగుబంట్లు తినే ఓక్ పండ్లు, గింజల కొరత ఏర్పడటం ఒక కారణమైతే, జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గిపోయి పొలాలు బీడుగా మారడంతో.. అడవి జంతువులు సులభంగా నగరాల వైపు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఎలుగుబంట్ల చొరబాట్లను నిరోధించడానికి జపాన్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
TMC rebellion : టీఎంసీలో తీవ్రమవుతున్న అంతర్గత కుమ్ములాటలు: 20 మంది ఎంపీల మద్దతు ఉందంటూ ప్రచారం!
BMW Toyota car price: జూలై 1 నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ కార్ల ధరలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Ishanvi Sabnivisu’s Invention: అమెరికా నేషనల్స్ ఆవిష్కరణల పోటీలో టాంపా తెలుగమ్మాయికి ద్వితీయ బహుమతి!
US – Israel : ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా అంశాలపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు!
Philippines earthquake: ఫిలిప్పీన్స్ భూకంపంతో విరిగిపడిన కొండచరియలు..35కి చేరిన మృతుల సంఖ్య
Prince William : రాజుగా బాధ్యతలు చేపట్టాక.. ఉచితంగా ఉంటున్న రాజకుటుంబీకులను ఖాళీ చేయించనున్న ప్రిన్స్ విలియం!
UN Security Council: పాక్‌పై ఐరాస వేదికగా భారత్ తీవ్ర ఆగ్రహం
Philippines Earthquake : ఫిలిప్పీన్స్‌లో భూకంపం: కుప్పకూలిన మాల్.. పరుగులు తీసిన ప్రజలు