
Realme 16 5G Massive Discount on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా realme 16 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే
చాలా చీప్ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనిపై లభిస్తున్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 16 5G Massive Discount on Flipkart Telugu: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన realme స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయ్యే ఈ మొబైల్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 256 GB స్టోరేజ్ కలిగి స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే, realme 16 5G మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.
realme 16 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే లభిస్తోంది. అయితే, దీనిని కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఇది 6.57 ఇంచుల Full HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో రావడం వల్ల స్క్రోలింగ్‌తో పాటు విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి.
ఈ realme 16 5G మొబైల్ 6nm ఆర్కిటెక్చర్‌పై పనిచేసే MediaTek Dimensity 6400 Turbo ఆక్టా-కోర్ ప్రోసెసర్‌పై రన్ అవుతుంది. అలాగే ఇది వివిధ రకాల స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది ఆండ్రాయిడ్ ఆధారిత realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. దీనిలో కంపెనీ చాలా ప్రత్యేకంగా FLUX Engine ఆప్టిమైజేషన్ అందించారు.
ఇక వెనక భాగంలో కంపెనీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇందులో వెనక భాగంలో ఇందులో 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP మోనోక్రోమ్ కెమెరాలను కూడా అందిస్తున్నారు. ఫ్రంట్ భాగంలో సెల్ఫీల కోసం..ప్రత్యేకంగా 50 MP AI సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో కంపెనీ నైట్ మోడ్, పోర్ట్రెయిట్, సినిమాటిక్ మోడ్‌తో పాటు అండర్‌వాటర్ (Under Water) ఫోటోగ్రఫీ సపోర్ట్ కూడా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రధాన హైలైట్ దీనిలోని భారీ 7000 mAh Titan బ్యాటరీ. ఇది ఎంతో సులభంగా 2 నుంచి 3 రోజుల వరకు బ్యాటరీని సపోర్ట్‌ను అందిస్తోంది. ఇందులో 60W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది. 6 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్ బాగుండేలా ప్రత్యేక అల్గారిథమ్స్ అందిచారు..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. 256 GB స్టోరేజ్ కలిగి వేరియంట్ ధర రూ.44,999 కాగా.. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ.8,000 వరకు ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.36,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్‌తో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే దాదాపు రూ.1,850 వరకు తగ్గింపు లభిస్తుంది.
దీనిపై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.15,950 వరకు బోనస్ లభిస్తుంది. అయితే, ఈ బోనస్ అనే స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటేనే, ఇంత భారీ మొత్తంలో బోనస్ లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.21,049కే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.