
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Saturn Transit In Revati Nakshatra Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. అయితే, ఈ గ్రహం అన్ని గ్రహాల కంటే చాలా నెమ్మదిగా కదులుతుంది. కర్మ, క్రమశిక్షణతో పాటు న్యాయానికి సూచికగా భావించే ఈ గ్రహం జూలై 2న రేవతి నక్షత్రంలోకి రెండవ స్థానంలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఈ నక్షత్ర మార్పు ప్రభావం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల విషయంలో, కార్యాలయం, ఆర్థిక అదృష్టం, కుటుంబ జీవితంతో పాటు మానసిక ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి కష్టాలు తప్పవా? మేష రాశి: శని సంచారంతో మేష రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలగడమే కాకుండా మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కార్యాలయంలో బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీంతో పాటు పె అధికారులతో విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కష్టపడి పనులు చేసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాకపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో భారీ మొత్తంలో ఆర్థికంగా కూడా నష్టపోతారు.
సింహరాశి: సింహ రాశివారికి కుటుంబ, ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. అంతేకాకుండా చివరిగా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఈ సమయంలో మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబ కలహాల కారణంగా మానసి ప్రశాంతతకు భంగం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు వీరు పొట్ట సంబంధిత సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి: శని పవర్ఫుల్ ఎఫెక్ట్‌తో వృశ్చిక రాశివారికి జీవితంలో కొన్ని రకాల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కొత్త అదనపు ఒత్తిడి పొందుతారు.. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీని ఫలితంగా ఆదాయం కూడా బాగా తగ్గుతుంది. అలాగే బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది. ఇక ప్రత్యర్థులతో ఈ సమయంలో తప్పకుండా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరు ఇతరులను గుడ్డిగా నమ్మకపోవడం చాల మంచిది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి: కుంభ రాశివారికి శని అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే, వీరికి శని చివరి దశ కొనసాగుతోంది. కాబట్టి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా విధులు నిర్వహణలో అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటే మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.