
రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ (Ramayana) చిత్రం తొలి భాగం దీపావళికి విడుదల కోసం సిద్ధమవుతోంది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’
(Ramayana) చిత్రం తొలి భాగం దీపావళికి విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి (Sai Pallavi), రావణుడిగా కన్నడ హీరో యశ్ (Yash) నటిస్తున్నారు. నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నితిశ్ తివారీ (Nitesh Tiwari)రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) మండోదరి పాత్రను పోషిస్తున్నట్లు ఇంతకుమందు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ ధ్రువీకరించారు. ‘రామాయణలో రావణుడి భార్య మండోదరిగా నటిస్తున్నా. అద్భుతమైన అనుభూతి కలిగించిన చిత్రం ఇది. సాంకేతికంగా సినిమా పై స్థాయిలో ఉంటుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇటువంటి చిత్రాన్ని ఇండియాలో ఇంతకుముందు ఎవరూ చూసి ఉండరు. అటువంటి సినిమాలో ఒక మంచి పాత్ర పోషించే అవకాశం లభించడం నా అదృష్టం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నటించడం నాకు ఇదే తొలి సారి. ఇది మన కథ. హృదయాలకు హత్తుకొనే విధంగా దర్శకుడు నితీశ్ తివారీ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు కాజల్.