
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Petrol Diesel Rates Today: మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరా గొలుసుపై ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో తన ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ85 ఇంధనాన్ని అధికారికంగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇదెలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు నేడు స్థిరంగానే కొనసాగుతన్నాయి.
అయితే పెట్రోల్ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో లీటరుకు రూ. 115.72తో అత్యధిక ధర ఉండగా, ఆ తర్వాతి స్థానంలో తిరువనంతపురంలో లీటరుకు రూ. 115.49గా ఉంది. 4 మెట్రో నగరాలలో, న్యూఢిల్లీ, కోల్‌కతాలో పెట్రోల్ ధరలు వరుసగా లీటరుకు రూ. 102.12 రూ.113.47 వద్ద స్థిరంగా ఉన్నాయి. కాగా, ముంబై, చెన్నైలలో ధరలు లీటరుకు 3 పైసలు, 4 పైసలు స్వల్పంగా పెరిగి వరుసగా లీటరుకు రూ.111.21 రూ.107.88కి చేరాయి.
ఇదిలా ఉండగా.. పెరుగుతున్న ఇంధన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు రాబోయే నెలల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమురు ధరలు ప్రస్తుత అధిక స్థాయిలలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని, రాబోయే నెలల్లో తగ్గుతాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ ఒత్తిడిలో ఉన్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో చమురు ధరలు బ్యారెల్ కు 100 డాలర్ల మార్కుకు చేరాయి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో చమురు.. గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాపై సంఘర్షణ ప్రభావం చూపినప్పటి నుండి ప్రపంచ ముడి చమురు ధరలు తీవ్రంగా పెరిగాయి. సంఘర్షణ ప్రారంభం కావడానికి ముందు, ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలలో సుమారు ఐదవ వంతు ఈ ఇరుకైన జలమార్గం గుండా వెళ్ళేది. అయితే, ప్రస్తుత ధరల స్థాయిలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.